మాజీ సర్పంచ్ ఎల్లయ్య భౌతిక దేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడవెండి గ్రామ ప్రథమ సర్పంచ్ కొమ్మగళ్ల ఎల్లయ్య (70) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం హైద్రాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన పార్థివదేహాన్ని వారి స్వగ్రామైన కడవెండి కి తీసుకురాగా శనివారం ఎల్లయ్య భౌతిక దేహాంపై గులాబీ కండువా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బస్వ మల్లేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి మండల అధికార ప్రతినిధి సుడిగెల హనుమంతు పీఏసీఎస్ వైస్ చైర్మన్ నక్క రమేష్ కడవెండి గ్రామ పార్టీ అధ్యక్షులు తాటిపెళ్లి మహేష్ సీనియర్ నాయకులు ఎరువ రైఫిల్ రెడ్డి దరగాని రాములు కోల యాదయ్య జేరిపోతుల సాయిలు పడమటింటి కొమురయ్య కాశబోయిన నగేష్ బాషిపాక రాములు అంజయ్య కుమార్ కత్తుల సుధాకర్ మండల యువజన నాయకులు సులుగూరి మహేష్ బాషిపాక అశోక్ ఉడుత రాజుకుమార్ అరవింద్ సురేష్ చింటు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments