కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలాన్నిచ్చేలా బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. పెనుబల్లి మండలం వి.యం. బంజార్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ సర్పంచ్ భూక్య పంతులు, మండల ప్రధాన కార్యదర్శి భూక్య ప్రసాద్‌తో పాటు బానోత్ బాలాజీ, ఏ. భద్ర, టీ. రాములు, హరియా, శంకర్, సత్యం, సోము, బాలాజీ నాయక్ తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు ప్రజలకు మరింత సేవ చేయడానికి అనుకూలంగా పనిచేస్తారని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామరావు, కీసరి శ్రీనివాసరెడ్డి, వంగా దామోదర్, మిట్టపల్లి కిరణ్, మాజీ ఎంపీటీసీ వంగా ఝాన్సీ, నిరంజన్ గౌడ్, మేకతోటి కృష్ణయ్య, గోగినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .