చెక్ డ్యామ్ లను, చెరువును సందర్శించిన బిఆర్ఎస్ నాయకులు

చెక్ డ్యామ్ లను, చెరువును సందర్శించిన బిఆర్ఎస్ నాయకులు

వనపర్తి, ఆగస్టు19 (తెలంగాణ ముచ్చట్లు):

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  పెద్దమందడి మండలంలోని పూర్తిస్థాయిలో నిండిన చెక్ డ్యాములను, చెరువులను బిఆర్ఎస్ నాయకులు సందర్శించారు. మంగళవారం పెద్దమందడి మండలంలోని జగతి పల్లి గ్రామ చెక్ డ్యామ్, చిలుకటోనీ పల్లి చెక్ డ్యామ్, వెల్టూర్ గోపాల సముద్రం చెరువును మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకుల సందర్శించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... రైతు సంక్షేమం , సాగునీరు అందించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల ఆధునీకరణ జరిగిందని వారు అన్నారు. చెక్ డ్యామ్ నిర్మాణం, చెరువుల ఆధునీకరణ వలన తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. చెక్ డ్యాములు, చెరువుల నిర్మాణం వలన భూగర్భ జలాల నీటిమట్టం పెరగడంతో పంట అధిక దిగుబడి  సాధించవచ్చని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముందు చూపుతో మండలంలోని చెక్ డ్యాములను, చెరువులను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, వెల్టూర్ గ్రామ అధ్యక్షులు మలక్ సురేష్, చిత్తూరు కృష్ణారెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, సుద్ధ బాయ్ రాజు, అడివన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.IMG-20250819-WA0033

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .