ఊరూరుకి బీఆర్‌ఎస్ సంక్షేమాలు – ఇంటింటికీ కేసీఆర్ పథకాలు
సముద్రాల గ్రామంలో బీఆర్‌ఎస్ సమావేశం ఘనంగా
తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హాజరు
ప్రజల మద్దతుతోనే సంక్షేమం సాధ్యమని వ్యాఖ్య
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు /ఆగస్టు 21/
జనగాం జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలంలోని సముద్రాల గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజయ్య మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. రైతులకు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఊరూరి వ్యవసాయాన్ని రక్షిస్తున్నాయి. విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, పింఛన్లు, కిట్లు – ఇవన్నీ సాధారణ ప్రజల జీవితాలను మార్చిన సంక్షేమ పథకాలు” అని తెలిపారు.
అలాగే, “ప్రజల మద్దతు ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. బీఆర్‌ఎస్ సంక్షేమ పాలనతో సముద్రాల వంటి గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఈ సంక్షేమ ఫలితాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడం పార్టీ ధ్యేయం” అని రాజయ్య అన్నారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జనగాం జిల్లా నాయకులు అక్కెనపల్లి బాలరాజు, ఎస్‌టిహెచ్ సెల్ మండల అధ్యక్షులు జెపాల్ నాయక్, ఎస్‌సి సెల్ జిల్లా నాయకులు మరపాక మనోహర్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నీలా కుమార్, ఎస్‌టిహెచ్ సెల్ మండల నాయకులు గుగులోత్ సమ్మన్న, గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.


Comments