టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో జాయింట్ డైరెక్టర్ వ్యవహారంపై బిఎస్ఎఫ్ తీవ్ర ఆరోపణలు

టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో జాయింట్ డైరెక్టర్ వ్యవహారంపై బిఎస్ఎఫ్ తీవ్ర ఆరోపణలు

-18 నెలలుగా నిర్వీర్యంగా ఉంచిన అధికారికి వేతనాలు

-అలవెన్సుల పేరిట సుమారు రూ.90 లక్షల ప్రజాధనం ఖర్చైనట్టు ఆరోపణ.

హైదరాబాద్,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో జాయింట్ డైరెక్టర్ వ్యవహారం ఇప్పుడు కేవలం నిర్వీర్య పరిపాలన అంశంగా కాకుండా, అవినీతి, అధికార దుర్వినియోగం, మహిళా అధ్యాపకుల పట్ల అవమానకర ప్రవర్తన, అలాగే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా మారిందని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ ఆరోపించారు.

గత 18 నెలలుగా సంబంధిత అధికారి ఎటువంటి కీలక పరిపాలనా లేదా అకాడమిక్ బాధ్యతలు లేకుండా, కేవలం ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మరియు బీరువా ఇన్‌ఛార్జ్ పనులకే పరిమితమై ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ వేతనం, అలవెన్సుల రూపంలో నెలకు సుమారు 5 లక్షల మేర చెల్లింపులు జరుగుతూ ఇప్పటివరకు దాదాపు 90 లక్షల ప్రజాధనం తెలంగాణ ఖజానా నుంచి ఖర్చైనట్టు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోని 56 పాలిటెక్నిక్ కళాశాలల్లో 36 కళాశాలలు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. కళాశాలలకు సీనియర్ అకాడమిక్ నాయకత్వం అత్యవసరమైన పరిస్థితిలో ఒక సీనియర్ ప్రిన్సిపాల్‌ను నిర్వీర్యంగా ఉంచడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని వ్యాఖ్యానించారు.

శాఖలో మరిన్ని ఆందోళన కలిగించే అంశాలు చర్చకు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారి మై హోమ్ భుజాలో ఖరీదైన నివాసం కొనుగోలు చేసినట్లు శాఖ వర్గాల్లో వినికిడి ఉందన్నారు. అలాగే కొత్తగా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమభద్దీకరణలో ముందస్తు తేదీలతో ఆర్డర్లు ఇచ్చారని, ఒక ఐఏఎస్ అధికారి సహకారంతో పోస్టింగులు జరిగాయని డిపార్ట్మెంట్‌లో చర్చ జరుగుతోందని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లకు సీఏఎస్ ఇప్పిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అప్పట్లో కమిషనర్ సంబంధిత అధికారికి ఉన్న అధికారాలను ఉపసంహరించి, కేవలం ఫ్లోర్ మరియు బీరువా ఇన్‌ఛార్జ్ బాధ్యతలకే పరిమితం చేశారనే అంశం కూడా శాఖలో చర్చనీయాంశంగా మారిందని తెలిపారు.

మహిళా అధ్యాపకుల పట్ల సంబంధిత అధికారి ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారని చెప్పారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళా లెక్చరర్లతో అవమానకరమైన, కఠినమైన భాషను ఉపయోగించిన ఘటనలు ఉన్నాయని, క్యాన్సర్ బాధితురాలు, బాలింతతో కూడా అనుచితంగా మాట్లాడిన ఘటనలు శాఖలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయని తెలిపారు.
ఇంకా, ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల పట్ల అనురాగం చూపడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారని చెప్పారు. కులాల వారీగా అధ్యాపకులను విభజిస్తూ అంతర్గత రాజకీయాలకు పాల్పడుతున్నారని, దీని వల్ల శాఖలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ – తెలంగాణ అన్ని అంశాలపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ప్రజాధనాల దుర్వినియోగంపై బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారిని ప్రిన్సిపాల్ లేని కళాశాలలో నియమించి, డైరెక్టరేట్‌లో కొత్త సీనియర్ ప్రిన్సిపాల్‌ను జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో పారదర్శకమైన, బాధ్యతాయుత పరిపాలన తీసుకురావాలని స్పష్టం చేశారు.తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .