పెద్ద కంపెనీలు తగ్గించి మార్జిన్ ఇవ్వటం వల్ల వ్యాపారాలు నష్టపోతున్నాయి...
మల్కాజిగిరి చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు
మల్కాజిగిరి, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
చికెన్ పెద్ద కంపెనీలు చిన్న చిన్న చికెన్ షాప్ దుకాణదారులకు మార్జిన్ ను తగ్గించి, పేపర్ రేట్లకే ఇవ్వాలంటే, పూర్తిగా నష్టపోతున్నామని, మా సమస్యలను గుర్తించి చికెన్ షాప్స్ కు గతం లో ఇచ్చిన మార్జిన్ ను మళ్లీ కొనసాగించాలని మల్కాజిగిరి చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పెద్ద కంపెనీ యాజమాన్యాలను కోరారు.
మల్కాజిగిరి చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వర్యంలో బుధవారం వినాయక్ నగర్‌లోని చికెన్ షాప్ గోదాం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి రాజు షాపు యజమాన్యులు పెద్ద కంపెనీలు చిన్న షాప్లపై ఆధారపడుతూ పేపర్ రేట్ల కంటే తక్కువ మార్జిన్ ఇవ్వడం వల్ల వ్యాపారాలు నష్టపోతున్నాయని, చికెన్ ధరలు పెరిగినా, తగ్గినా లాభాలు కంపెనీలకు, నష్టాలు మాకే వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితులలో మా బ్రతుకులను కష్టతరంగా మారుస్తున్నాయని, ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి సరైన ధరలు నిర్ణయించి, ఒకే ధర విధానాన్ని పాటించాలని, ఇష్టానుసారం ధరలను పెంచడం లేదా తగ్గించడం చేయవద్దన్నారు. గతంలో మాధురి కంపెనీ పేపర్ రేట్ల కంటే 10 రూపాయల అధిక మార్జిన్ ఇచ్చినప్పుడు వ్యాపారం కొంత బాగుపడిందని, అలాంటి విధానంను మళ్లీ అమలు అయితే కొంత ఊరట కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్. నరేష్, ట్రెజరర్ కన్నా, నరేందర్ రెడ్డి, గోపాల్ నాయక్, ఖాసీం, రాజేష్, ఆరీఫ్, అజయ్ గౌడ్, సత్యనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments