పంచాయతీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పిలుపు

గ్రామాభివృద్ధికి అందరం కలసి కృషి చేయాలి 

పంచాయతీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పిలుపు

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెలిదే వెంకన్న

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్9(తెలంగాణ ముచ్చట్లు):

జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలంలోని తానేదారిపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో, బెలిదే వెంకన్న అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బెలిదే వెంకన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలాంటి పదవులు లేదా పైరవీలు ఆశించకుండా గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో గ్రామంలో సిసి రోడ్లు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీహరి తానేదారిపల్లి గ్రామాన్ని దత్తతగా స్వీకరించి, పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఇందిరమ్మ గృహ జ్యోతి పథకం కింద వందకు పైగా ఇండ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. అధికార పార్టీ అభ్యర్థులే సర్పంచులుగా విజయం సాధిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ సందర్భంగా తానేదారిపల్లి, విశ్వనాధపురం, పరిసర తండాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిపారు.
తానేదారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా మంతెన ఇంద్రారెడ్డి, సర్పంచ్ అభ్యర్థిగా హరిత ఇంద్రారెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ మాచర్ల కుమారస్వామి, సీనియర్ నాయకులు దుంపల పద్మారెడ్డి, మంతెన మైపాల్‌రెడ్డి, ఉడుత బిక్షపతి, ఆకుల కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ మాచర్ల బిక్షపతి, గాదే చంద్రయ్య, గాదే బాబు, గాదే సుధాకర్, ఆకుల సుదర్శన్, అంగిడి సమ్మయ్య, గజవెల్లి దయాకర్, మంతెన లక్ష్మారెడ్డి, దుంపల సురేష్ రెడ్డి, నర ఎల్లారెడ్డి, మాలోత్ శంకర్, విశ్వనాధపురం సంపత్‌రెడ్డి, గాదే అనిల్, చుక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251009-WA0032

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .