సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఉత్తమ ఉద్యోగులకు నగదు బహుమతులు.

సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్న డీఎం సునీత .

సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఉత్తమ ఉద్యోగులకు నగదు బహుమతులు.

సత్తుపల్లి, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అత్యధిక ఆదాయాన్ని సాధించిన కండక్టర్లు, ఇంధన పొదుపుతో కిలోమీటర్ల ప్రయాణం చేసిన డ్రైవర్లకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు కలిసి 21మంది ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు.

ఈ సందర్భంగా డీఎం సునీత మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని, అధిక ఆదాయంతో పాటు ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్ పి. విజయశ్రీ, ఎంఎఫ్‌ఎస్ సాహితీ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .