26న ఖమ్మంలో సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.

సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు జమ్ముల జితేందర్రె రెడ్డి

26న ఖమ్మంలో సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

డిసెంబర్ 26న సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మం నగరంలో నిర్వహించే భారీ ప్రదర్శనలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ నాగిలిగొండ గ్రామ శాఖ సమావేశం అరికొట్ల భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జమ్ముల జితేందర్రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన, రెడ్పర్ట్ వాలింటర్ల కవాతు, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.పార్టీ శత వసంతాల సందర్భంగా అన్ని గ్రామల్లో పతాకావిష్కరణ తో పాటు పార్టీ గత చరిత్రను, పార్టీ సాధించిన పోరాట విజయాలను నేటి తరాలకు తెలియజేయాలన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ కార్మిక రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. అమిల్షా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడమంటే భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజానికాన్ని అవమానించడమేనన్నారు.బీజేపీ మతం పేరుతో ఉన్మాదం సృష్టిస్తుందన్నారు. బీజేపీ భారత రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి ఆర్టికల్ 370 సవరణ, ఫెడరల్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిందన్నారు. దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి పేదవాళ్లని బానిసలుగా మారుస్తుందన్నారు.26న జరిగే ప్రదర్శనకు భారీగా తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు వేపూరి రవీంద్రబాబు,పదిమల వెంకటనర్సయ్య, షేక్ చిన్న జాన్, వజీర్,ముఖర్జీ, చాట్ల రమేష్,పంది పుల్లయ్య, దమ్మాలపాటి శ్రీనివాస్, శేఖర్, ఏలియా, చాట్ల బాబు, వేపూరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .