నేటి బీసీ బంద్‌ ను జయప్రదం చేయండి.

నేటి బీసీ బంద్‌ ను జయప్రదం చేయండి.

బంద్ కు DBF సంపూర్ణ మద్దతు.

డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్.

హసన్‌పర్తి, అక్టోబర్ 17(తెలంగాణ ముచ్చట్లు):
 
బిసిలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అక్టోబర్ 18వ తేదీన  రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలకు దళిత బహుజన ఫ్రంట్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ తెలిపారు.ఈ సందర్భంగా 
 మాట్లాడుతూ  బందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి బందును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.బీసీల రాష్ట్ర బంద్ ద్వారా బీసీల ఐక్యతను చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి వినిపించడం కోసమే బంద్ చేయాల్సి వస్తుందని  బీసీలకు న్యాయం జరిగే వరకూ  పోరాటం ఆపేది లేదన్నారు.బీసీలకు న్యాయబద్ధంగా రావలసిన రిజర్వేషన్లను కోర్టులను వేదికలుగా చేసుకొని అగ్రకులాలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే బీసీల ఉద్యమం వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదని బీసీ వ్యవస్థకు మేలు జరిగే ఉద్యమం అని, 
ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ శ్రేణులు కలిసి వచ్చి ఈనెల 18న జరిగే రాష్ట్ర బంద్ ను చరిత్రలో కనివిని ఎరిగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తూ బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని కుట్రలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేలా బీసీలు ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు.
 రాష్ట్ర బంద్ కు అఖిలపక్ష,వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడికక్కడ బీసీలు జేఏసీలుగా ఏర్పడి బందును విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ డిబిఎఫ్ రాష్ట్ర మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ,హసన్‌పర్తి పిఎసిఎస్ డైరెక్టర్ చుంచు విజేందర్,డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల అనిత,జిల్లా కార్యదర్శి చుంచు నరేష్,జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్,ప్రముఖ న్యాయవాది బచ్చలకూరి సారంగపాణి,డిబిఎఫ్ 65 డివిజన్ అధ్యక్షులు ఇసంపల్లి కిరణ్,జిల్లా నాయకులు చుంచు రాజు,ప్రశాంత్,బస్వారెడ్డి,
శివకుమార్,కిరణ్,సుదన్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .