కాజీపేట లో చైన్ స్నాచింగ్
Views: 16
On
కాజీపేట్ అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ లోని భవాని నగర్ లో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం భవాని నగరంలో నివాసం ఉంటున్న పూల లలిత డిజిల్ కాలనీ చౌరస్తాలో టైలర్ షాపు నిర్వయించుకొంటున్నది. ఎప్పటిలాగే లలిత అనే మహిళ షాప్ కు తాళం వేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం పై వచ్చిన గుర్తుతెలియనివ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు 6 తులాల పుస్తెలతాడు, చైన్ ను లాక్కెళ్లాడని ఆమె తెలిపారు. ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బైక్ ను వెంబడించగా ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై అధివేగంగా పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments