గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారానికై చలో హైదరాబాద్

-సిఐటీయు జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు 

గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారానికై చలో హైదరాబాద్

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: 
 
గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు బకాయి సహా పలు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న “చలో హైదరాబాద్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రకటించింది.
 
సిఐటియు ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఉద్యోగులు నాలుగు నెలల నుంచి పది నెలల వరకు వేతనాలు లేకుండా బాధలు పడుతున్నారని, అప్పులపాలై పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
వేతనాలు బకాయి, జీవో 51పై విమర్శలు 
 
ప్రభుత్వం పంచాయతీ సిబ్బందిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన రాపర్తి రాజు, మల్టీపర్పస్ వర్కర్ విధానం (జీవో 51) కారణంగా సిబ్బంది పలు బాధలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం కారణంగా 186 మంది సిబ్బంది మరణించారని, వారికి ఎటువంటి భరోసా లేదా ఇన్సూరెన్స్ సౌకర్యం లభించలేదని అన్నారు.
 
డిమాండ్లు:
• వేతనాల బకాయిలను వెంటనే చెల్లించడం.
•మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయడం.
•గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయడం.
•ఇన్సూరెన్స్ సౌకర్యం రూ. 10 లక్షలు అందించడం.
•కనీస వేతనాలు అమలు చేయడం.
WhatsApp Image 2024-12-14 at 4.13.15 PM
ఆందోళనలో పాల్గొనాలని పిలుపు:
 
ఈనెల 17న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద “చలో హైదరాబాద్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ ఈ ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కోడేపాక యాకయ్య, యూనియన్ నాయకులు బోసురాజు, కుంభం రాజు, చింత వినయ్, సింగపురం అనిల్, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .