తెలంగాణ గ్రామీణ బ్యాంకు గా మార్పు
2025 కొత్త సంవత్సరం నుంచి పేరు మార్పు అమలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఖాతాదారులకు అన్ని రకాల సేవలు బంద్ బ్యాంకు మేనేజర్ బి నెహ్రూ ప్రకటన
స్టేషన్ ఘనపూర్ : తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్ ఘనపూర్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరును 1జనవరి 2025 నూతన సంవత్సరం నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు గా పేరు మారుతున్నట్లుగా స్టేషన్ ఘనపూర్ బ్యాంకు మేనేజర్ బి. నెహ్రూ, తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఉన్న పలు రకాల గ్రామీణ బ్యాంకులన్నింటిని కలుపుతూ ఆయా రాష్ట్రల పేర్లపై గ్రామీణ బ్యాంకులుగా మార్చిందని అన్నారు. అందువల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు గా పనిచేస్తున్న ఈ కొత్త సంవత్సరం నుంచి " తెలంగాణ గ్రామీణ బ్యాంక్” గా మారుతుంది అన్నారు. ఈ మార్పుల చేర్పుల ను చేయడానికి డిసెంబర్ 28, 29, 30, 31 వరకు నాలుగు రోజులపాటు ఖాతాదారులకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగు రోజులలో బ్యాంకు లో పూర్తిగా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నారు. ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ యూపీఐ సేవలు నిలిచిపోతాయని తెలిపారు. జనవరి ఒకటో తేదీ 2025 నుంచి మళ్లీ ఖాతాదారులకు యధావిధిగా సేవలు అందిస్తామని మేనేజర్ బి. నెహ్రూ ప్రకటించారు.


Comments