ఈవీఎం స్ట్రాంగ్ రూములను తనిఖీ  కలెక్టర్ ప్రావీణ్య 

ఈవీఎం స్ట్రాంగ్ రూములను తనిఖీ  కలెక్టర్ ప్రావీణ్య 

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా నిర్వహించారు.

కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల భద్రతా పరిస్థితులను, రికార్డుల నిర్వహణను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఈవీఎంల భద్రత చర్యలు పటిష్ఠంగా ఉండాలని, స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగాలని” అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాస్ రావు, శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.IMG-20241210-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .