పల్లకి సేవలో పాల్గొన్న చింతనిప్పు కృష్ణ చైతన్య
వివిధ డివిజన్లో గణపయ్యకు ప్రత్యేక పూజలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
నగరంలోని పలు గణేష్ మండపాల వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక 41వ డివిజన్ లోని చెరువు బజార్లో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడికి స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్, యువజన నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. స్థానిక 55వ డివిజన్లో నిర్వహించిన ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం, విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, యువ నేత చింతనిప్పు కృష్ణచైతన్య, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు యువతలో చైతన్యాన్ని, ఐకమత్యాన్ని నింపుతున్నాయన్నారు. గణేష్ నిమజ్జనం వరకు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో వేడుకలు నిర్వహించాలని కృష్ణ చైతన్య కోరారు.


Comments