సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేతన్నలు పాలాభిషేకం

ప్రభుత్వా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన చేనేత కార్మికులు 

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేతన్నలు పాలాభిషేకం

-- వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులు సి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చి, ఈ పథకం కింద నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం  రూ.168  కేటాయించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వల్ల ఎంతోమంది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా మూడు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పథకాలను ప్రవేశపెట్టి  ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి లకు చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెల్ట్ ఉంది చేనేత సహకార సంఘం అధ్యక్షులు సి. వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బాలచంద్రయ్య, వెల్టూర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .