ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేసిన సిఎం
Views: 2
On
హైదరాబాద్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు బహుజన చరిత్రలో తొలి చక్రవర్తిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన సమాజానికి ఆదర్శంగా నిలిచారని, ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ప్రేరణనిస్తుందని తెలిపారు. తెలంగాణ సమాజ చరిత్రలో పాపన్న స్థానాన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ప్రతిష్టించబోతోందని చెప్పారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments