మంత్రి సీతక్క చొరవ.. కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్ల దస్త్రంపై సీఎం సంతకం

మంత్రి సీతక్క చొరవ.. కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్ల దస్త్రంపై సీఎం సంతకం

హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్‌ అందించింది. ఈ రెన్యువల్‌ పత్రాలు కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న సమయంలో, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని,సీఆర్టి  రెన్యువల్‌ ఫైల్‌ను అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ చర్చల అనంతరం, గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రెన్యువల్‌ పత్రంపై సంతకం చేశారు. ఈ నిర్ణయానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .