పరీక్షల నిర్వహణకు జిల్లాలో 85 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. కలెక్టర్
ఈ నెల 9 నుండి హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవాలి.. కలెక్టర్
ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు.. కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ఈ నెల 15, 16 తేదీల్లో జరగబోయే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 85 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు రెండు సెషన్లుగా వుంటాయని ఆయన తెలిపారు.
అభ్యర్థులు పరీక్షల హాల్ టికెట్లు ఈ నెల 9 నుండి డౌన్లోడ్ కు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం సెషన్ పరీక్షకు, పరీక్షా కేంద్రం గేట్ ను ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారని, గేటు మూసిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరని కలెక్టర్ అన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ కోరారు.
పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఒకరోజు ముందు వెళ్లి లొకేషన్ చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, సెల్ఫోన్, పెన్ డ్రైవ్ ,బ్లూ టూత్ డివైజెస్, జువెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని , చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని కలెక్టర్ అన్నారు.
డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లో ఫోటో స్పష్టంగా లేకున్న, సరిగా కన్పించకున్న అభ్యర్థులు, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ అధికారి లేదా చివరిసారి చదివిన కళాశాల ప్రిన్సిపాల్ తో అటెస్ట్ చేయించి, పరీక్షా కేంద్ర ఇన్విజిలేటర్ కి అందజేయాలన్నారు.
దివ్యాoగ అభ్యర్థులు అర్హత గల స్క్రైబ్ ను/ కాంపెంసేటరి సమయాన్ని సదరం ధ్రువీకరణ/అపెండిక్స్-3 తో పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ కు సుమర్పించాలన్నారు.
అభ్యర్థులు హాల్ టికెట్ లో సూచించిన సూచనలను విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటన లో పేర్కొన్నారు.


Comments