కాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
Views: 31
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
కాజీపేట తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డుల గదిని పరిశీలించి,నిర్వహణ ప్రమాణాలపై అధికారులతో చర్చించారు
.కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారుల కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలపై తహసీల్దార్ భావు సింగ్‌ను ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లతో సమావేశమై, రెవెన్యూ సేవల పంపిణీ, ఫైలుల ప్రాసెసింగ్ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ప్రణయ్ కుమార్, ఆర్‌ఐలు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments