ముక్కోటి ఉత్సవాలకు రండి

జిల్లా కలెక్టర్ కు ఈవో ఆహ్వానం 

ముక్కోటి ఉత్సవాలకు రండి

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

జనవరి 9,10 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరుకావాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను ఐడీఓసీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు ఆహ్వాన పత్రిక అందించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భద్రాచలం ఆలయ ఈవోను ముక్కోటి ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, వసతి, వైద్య, భద్రత సదుపాయాలు వంటివి అందుబాటులో ఉంచాలని చెప్పారు. ముక్కోటి వేడుకల ఏర్పాట్లు భక్తులు మెచ్చేలా ఉండాలన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .