జూబ్లీహిల్స్ లో రానున్నది..కాంగ్రెస్ ఘన విజయమే

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

జూబ్లీహిల్స్ లో రానున్నది..కాంగ్రెస్ ఘన విజయమే

* రాష్ట్ర మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ తో కలిసి విస్తృత ప్రచారం

ఖమ్మం బ్యూరో, నవంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రానున్నది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయమేనని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా.. గత 15 రోజులుగా ప్రచారం చేస్తున్న ఎంపి రఘురాం రెడ్డి.. ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి కొల్లూరు కాలనీలో.. విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేష కృషి జరుగుతోందని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేసేందుకు రేషన్ షాపు లు ఏర్పాటు చేశామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, నాయకులు భరత్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .