కుషాయిగూడలో పోలీస్ అమరవీరుల స్మారక ర్యాలీ
కుషాయిగూడ, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.కుషాయిగూడలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నుండి రాధిక ఎక్స్ రోడ్ వరకు ర్యాలీగా నడిచి పోలీస్ అమరవీరులత్యాగాలకు నివాళులర్పించారు.
.రాధిక ఎక్స్ రోడ్ వద్ద విద్యార్థులు, పోలీసులు కలిసి అమరవీరుల త్యాగాలకు సంఘీభావంగా మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించారు.ఈ ర్యాలీలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, సాయిలు, విజయ, సతీష్‌తో పాటు కుషాయిగూడ పోలీస్ సిబ్బంది, పరిసర పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సజావుగా, విజయవంతంగా పూర్తయింది.


Comments