పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ 

పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ 

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు.కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ పడిపోవడంతో స్థానిక పోలీసులను ఎన్డీఆర్ఎఫ్ బృందలను అప్రమత్తం చేశారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగాప్రవహిస్తుండటంతోనీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా మున్నేరు వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!