రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతు పండుగ సంబరాలకు భారీగా తరలి వెళ్లిన గ్రామస్తులు

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

-- వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ లో నిర్వహించిన రైతు సంబరాలకు వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి ఆదేశం మేరకు గ్రామ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులను, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించడం జరిగింది. రైతులను ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులో తరలించడం జరిగింది. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఆయన అన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, మరి ధాన్యానికి బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. రైతు పండుగ సంబరాలకు విశేష స్పందన వచ్చిందని, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేసినందుకు రైతులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సి .వెంకటయ్య, మాజీ సర్పంచ్ బాల్ చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, విజయ్ కుమార్, వడ్డే శేఖర్, దిండు రవీందర్, వివేక్, గుండెల ఆంజనేయులు, చందు రెడ్డి, ఉప్పరి రామచంద్రయ్య, గోవర్ధన్ రెడ్డి, మిల్లర్ రాజు, కుమ్మరి కొండన్న, ఆనంద్ గౌడ్, కానాపురం మన్నెం ,మహిళా సమాఖ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, ఏ ఈ ఓ  వినోద్ కుమార్, రైతులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .