తప్పు హామీలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్

ఘనపూర్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య

తప్పు హామీలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్

ఖిల్లా ఘనపూర్, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు దాదాపు 35 సంవత్సరాలుగా ఎలాంటి నీటి వసతులు లేక, నర్రెలు బారిన చెరువుగా ఉంది. 2017లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ కేటాయింపులు లేకపోయినా, సీఎం కేసీఆర్‌తో సమన్వయం చేసి, కే.ఎల్.ఐ ద్వారా మంగనూరు నుంచి గణపసముద్రానికి నీరు సరఫరా చేశారు.

ఘనపూర్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాళ్ళ కృష్ణయ్య తెలిపారు, చెరువు వెనుక ఎన్నో సంవత్సరాలుగా సాగునీరు లేక కంపచెట్లతో నిండిన పొలాలను పచ్చని పంటలుగా మార్చడం జరిగింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల విజ్ఞాపన మేరకు 2023 జూలై 20న కొత్త జీవో ద్వారా 12 లక్షల కింద చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. మేగారెడ్డి ఎన్నికల్లో హామీలతో రైతులను మోసం చేసి, ఎకరాకు 20–25 లక్షలు ఇవ్వాలని ప్రకటించారు. రాధాకృష్ణయ్య అన్నారు, “మేఘారెడ్డి ఓట్లు గణపసముద్రం రైతులకు న్యాయం చేస్తాడా? రేవంత్ రెడ్డికి ఓట్లు ఇచ్చినా రైతులకు న్యాయం జరుగుతుందా?” ఘనపూర్‌లో బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షంలో మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .