స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ
జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాల్లో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు.
పదేళ్లు బీసీలను అణగదొక్కారు: మహేష్ కుమార్‌గౌడ్
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మహేష్‌కుమార్‌గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని అన్నారు. పదేళ్లు బీసీలను అణగదొక్కి అగ్రవర్ణాలకే అంకితమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని మహేష్‌గౌడ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు టీపీసీసీ ఇవ్వడంతో పాటు బీసీల డిపార్ట్‌మెంట్‌కు అత్యధిక నిధులు ఇచ్చిందని మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.


Comments