సెవెన్ హిల్స్ కాలనీలో కమాన్ శంకుస్థాపన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీలో కమాన్ (ముఖ ద్వారం) నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమి పూజను వైభవంగా నిర్వహించారు.కాలనీ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కాలనీ ముఖధ్వారం నిర్మాణానికి సహకరిస్తున్నవెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ గుప్తా, మధుకర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సల్లా ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, రామ్ రెడ్డి, లక్ష్మణ చారి, బాలేశ్వరయ్య, రామయ్య, సోమిరెడ్డి నారాయణ, సత్తయ్య, ఎల్లయ్య, మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments