సీసీ రోడ్డును పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
Views: 26
On
నాచారం, ఆగస్టు 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ గురువారం పర్యవేక్షించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను డిఈ బాలకృష్ణ, ఏఈ వినీత్‌లతో కలిసి ఆయన పరిశీలించారు.
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి పనులు ప్రారంభం కావడంతో స్థానిక బస్తివాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతను కచ్చితంగా పాటించాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, దేవులపల్లి యాదగిరి, అశు కట్ట, బుచ్చన్న గౌడ్, రవి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments