నేడు సి.పి.ఐ ప్రదర్శన, సభ

హాజరుకానున్న కూనంనేని

నేడు సి.పి.ఐ ప్రదర్శన, సభ

తోర్నాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

భారత కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భాసభ గురువారం ఉదయం జరుగనున్నది. ఆవిర్భాదినోత్సావాన్ని పురస్కరించుకొని ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా వంద మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు అరుణ పతాకాలతో ప్రదర్శన ముందుబాగాన నిలుపనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శనలో రెడ్పర్ట్్వలంటీర్ల తరువాత డప్పు, కోలాట నృత్యాలు కార్యకర్తల ప్రదర్శన సాగనున్నది. భక్తరామదాసు కళాక్షేత్రం సభను నిర్వహించనున్నారు. ఈ సభలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పశ్యపద్మ, బాగం హేమంతరావు తదితరులు పాల్గొననున్నట్లు సి.పి.ఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. సభ ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలో తోర్నాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే జిల్లా వ్యాపితంగా సభలు, సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. 99 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రకలిగిన భారత కమ్యూనిస్టుపార్టీ వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా సుదీర్ఘ పోరాట చరిత్రను నేటి తరాలకు తెలియజెప్పేందుకు ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం జరిగే ప్రదర్శనలో 5 వేల మంద ప్రజలు పాల్గొననున్నారని సురేష్ తెలిపారు. ప్రజాఉద్య చుక్కానిగా ఉన్న సి.పి.ఐ ప్రజా సమస్యలపై పోరాటంలో ముందు పరుసలో నిలిచిందని పాలకుల విధానాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో కమ్యూనిస్టుల పురోగమనం తప్పదని సురేష్ తెలిపారు.

ఏపూరి బ్రహ్మం ఇక లేరు సి.పి.ఐ నేతల ఘన నివాళీ

WhatsApp Image 2024-12-25 at 7.35.14 PM (1)భారత కమ్యూనిస్టుపార్టీ ఉమ్మడి ఖమ్మంజిల్లా సీనియర్ నాయకులు ఏపూరి బ్రహ్మం (75) తీవ్ర అనారోగ్యంతో బుధవారం తెల్లవారుఝామున మృతి చెందారు, సింగరేణి ఉద్యోగిగా, ట్రేడయూనియన్, సి.షిఐ, రైతు సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేశారు. బ్రహ్మంకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బ్రహ్మం మృతి వార్త తెలిసిన వెంటనే సి.పి.ఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ తదితరులు బ్రహ్మం భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసినివాళులర్పించారు. బ్రహ్మం మృతితో సి.పి.ఐ ఒక నిబద్ధత కల నాయకున్ని కోల్పోయారన్నారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర సమితిసభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఏపూరి లతాదేవి, జిల్లా కార్యవర్గసభ్యులు పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వరరావు, జిల్లా సమితిసభ్యులు తాటి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .