బీజేపీని ఓడించడమే సీపీఐ(ఎం) లక్ష్యం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి.
హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:
దేశంలో బీజేపీ పార్టీని ఓడించడమే సీపీఐ(ఎం) లక్ష్యమని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం హసన్ పర్తి మండల కేంద్రంలో సీపీఐ(ఎం)మండల కమిటీ సభ్యుడు పుల్ల అశోక్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జి.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే కార్పొరేషన్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు.పార్టీ కేంద్రీకరించిన కొన్ని స్థానాల్లో సీపీఐ(ఎం) పార్టీ పోటీ చేస్తుందన్నారు. అలాగే బీజేపీని ఓడించడానికి మిత్రపక్షాలు ముందుకు వస్తే వారితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను కూడా అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.మండల కమిటీ సభ్యులు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో హసన్ పర్తి మండల కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు,జిల్లా కమిటీ సభ్యురాలు వేలు రజిత,మండల కమిటీ సభ్యులు మంద సుచందర్, వేలు సుమన్, జి. సతీష్,ఎన్.మౌనిక తదితరులు పాల్గొన్నారు.


Comments