చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు రవాణా సౌకర్యాల కోసం సిపిఎం ధర్నా

ప్రయాణికుల సమస్యలపై ప్రధాన ఆందోళన

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు రవాణా సౌకర్యాల కోసం సిపిఎం ధర్నా

 చర్లపల్లి, సెప్టెంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు): 

చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్‌కు తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం డిమాండ్ చేశారు. గురువారం మేడ్చల్ జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో టెర్మినల్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.ధర్నాకు వచ్చిన ప్రసంగంలో పి. సత్యం, సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాన మంత్రి జనవరిలో ప్రారంభించినప్పటికీ, రహదారి కనెక్టివిటీ, ప్రజా రవాణా సౌకర్యాల లేమీ కారణంగా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైలు టికెట్ ధర కంటే స్టేషన్‌కి చేరుకోవడంలో వ్యక్తిగత ఖర్చు ఎక్కువ అవుతున్నదని స్పష్టపరిచారు.అతను టెర్మినల్ నుండి పలక్‌నామా, లింగంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, మేడ్చల్ ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఘట్కేసర్, లింగంపల్లి నుండి ఒక్కో ట్రిప్ మాత్రమే నడపడం, ప్రజా రవాణా సమస్యల కు నిదర్శనమని ఆయన అన్నారు. ఎంఎంటీఎస్ రాకపోకలకు కారణమైన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైల్వే అధికారులను కోరారు.అలాగే, ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందు న బస్సుల సంఖ్యను పెంచి, రైలు సమయాలకు సరిపడేలా ఆర్‌టి‌సి బస్సులను నడపాలని, మెట్రో రైలు విస్తరణ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ప్రారంభించాల ని పిలుపునిచ్చారు.WhatsApp Image 2025-09-25 at 6.31.04 PMచర్లపల్లి రైల్వే టెర్మినల్ కనెక్టివిటీ మెరుగు పడేందుకు రహదారి విస్తరణ అత్యవసరమని ఆయన సూచించారు.ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి, ఎం. వినోద్ భారతీయ రైల్వేను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో ఇప్పటి వరకు కొత్త లైన్ నిర్మాణం లేకుండా పాత లైన్లపైనే ప్రజల సొమ్మును వసూలు చేస్తోందని విమర్శించారు.క్రమంగా, సిపిఎం పార్టీ బృందం రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు ఎం. శంకర్, ఎన్. సబితా, సీనియర్ నాయకులు జి.యాదగిరి రావు, శ్రీమన్నారాయణ, సోమయ్య చారి, శరత్, పి. గణేష్, ఎమ్మెస్ రావు, సఫియా సుల్తానా, దుర్గయ్య, జీవీరావు, సిహెచ్. లీలావతి, బి. నరసింగా రావు, డి. ప్రభాకర్, సిహెచ్. అశోక్, మణికంఠ, టి. నరసింహ, ఆదామ్, రవీందర్ రెడ్డి తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .