సిపిఎస్ అంతమే పి ఆర్ టి యు లక్ష్యం
మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణచేసిన పి ఆర్ టి యు ఉమ్మడి రాష్ట మాజీ అధ్యక్షులు
పేరి వెంకట్ రెడ్డి
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
సిపిఎస్ అంతమే లక్ష్యంగా పి ఆర్ టి యు సంఘం పని చేస్తుందని ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి అన్నారు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రములో ని జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఉపాధ్యాయ, ఉద్యోగస్థులకుఆశనిపాతంగా మారి నటువంటి టువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ను సమూలంగా రూపుమాపడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పి ఆర్ టి యు టీఎస్ పూనుకుందని, దానిలో భాగంగానే సంఘ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 01 న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ నందు తలపెట్టిన మహాధర్నా కు సంబంధించిన మహాధర్నా పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిపిఎస్ ను సంపూర్ణంగా అంతం చేసి ఓ పి ఎస్ ను తీసుకొచ్చే బాధ్యత పి ఆర్ టి యు సంఘం తీసుకుందని,ఈ మహాధర్నాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు హాజరై, ప్రతి సిపిఎస్ ఉపాధ్యాయుడు మహాదర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు మహాధర్నా ను విజయవంతం చేయాలని తెలియజేయడం కోరారుఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టీఎస్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మోరెడ్డి బౌద్దారెడ్డి, సూర చంద్రశేఖర్, జిల్లా టి ఇ జెఎసి కన్వీనర్ సూగూరు వరప్రసాద్ రావు, టి ఎస్ సి పి ఎస్ ఇ యు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మద్దిలేటి, రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి మోహన్ బాబు 15 మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు,సీనియర్ కార్యకర్తలు, సంఘ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments