వినాయకుని సేవలో తరించిన దయాకర్ రెడ్డి, మేకల మల్లిబాబు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలోని కొత్త కాలనీ సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ రోజు అయిన శుక్రవారం నాడు జరిగిన విశేష పూజలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ - అన్నపూర్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, కారేపల్లి సిఐ తిరుపతి రెడ్డి పూజానంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్, తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి ప్రతిరూపమే వినాయక రూపమని, ప్రకృతిలోని మట్టి ద్వారా తయారుచేసిన గణపతి రూపంలో మళ్లీ ప్రకృతిలోనే నీటిలో నిమజ్జనం చేస్తున్నామని, ఇందులోనే నిగూఢమైన ఆధ్యాత్మికత దాగున్నదని, ప్రకృతిని పరిసర ప్రాంతాలను, స్నేహితులను బంధువులను, సాటి మనుషులను కులాలు, మతాలు రాజకీయాలకతీతంగా ప్రేమించాలని పిలుపునిచ్చారు. గతంలో 1893లో మహారాష్ట్రలో ని పూణేలో గణేష్ నవరాత్రుల మండపాలు స్వాతంత్ర పోరాట యోధుడు గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో నాటి పాలకులైన బ్రిటిష్ వారిని పారిద్రోలటానికి యువతను ఐక్యం చేయడానికి, పోరాట స్ఫూర్తి కలిగించడానికి ప్రారంభించడం జరిగిందని, ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి వీధిలో వినాయకుడు విశేష పూజలు అందుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో,విశేష పూజలో వేలాది మంది పాల్గొని తమ భక్తీ ప్రపత్తులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె పతే మహమ్మద్, బానోతు నరసింహ నాయక్, మాజీ సర్పంచ్ కస్తూరి, కొమ్మినేపల్లి మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు,మేకపోతుల మహేష్, మైనారిటీ నాయకులు ఎస్.కె రబ్బాని పాషా, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, గుగులోతు రవి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, శీలం పుల్లయ్య, బండి ఉపేందర్ జక్కంపూడి వెంకటేశ్వర్లు, చల్ల మల్లయ్య, జలగం శ్రీను,బానోతు లక్ష్మ, బొమ్మగాని పిచ్చయ్య,చల్ల నాగేశ్వరరావు తురకభిక్షం దేరంగుల తిరుపయ్య, బాదావత్ నాగరాజు రాయల నాగ శంకర్, గొడుగు సాయి, బానోతు లక్ష్మి, తురక వీరబాబు, గంట శ్రీను, గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ, మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments