క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు: పాలేరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, ఎదులాపురం, గుదిమళ్ళ, కొండాపురం గ్రామాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో, తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ఫాస్టర్ లు దయాకర్ రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో వావ్ ఎలక్ట్రికల్ స్కూటీ షోరూంను ప్రారంభించారు. అదేవిధంగా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో రామసహాయం అరవింద్ రెడ్డి తల్లి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments