ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహర్ష ఫైనాన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మమతా రోడ్ లోని కాకతీయ పాఠశాలలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి లో జరిగిన ఆధారపు రమేష్ కుమారుని వివాహానికి, గోళ్ళపాడు గ్రామంలో జరిగిన గార్ల లక్ష్మయ్య కుమారుని వివాహానికి హాజరయ్యారు. కూసుమంచి మండలంలో జరిగిన కాంపాటి కోటయ్య కుమారుని వివాహ నిశ్చితార్థానికి, పోలంపల్లి ఉప్పలయ్య కుమారుని వివాహానికి హాజరయ్యారు. చేగొమ్మలో కొండపర్తి సురేష్ పెదనాన్న దశదిన కర్మలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .