మేడ్చల్,శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్ణయం 

డీపీఆర్‌ను సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశాలు 

మేడ్చల్,శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్ణయం 

-హైదరాబాద్ లోని ఈ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్ 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్‌లకు మెట్రో పొడగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశించినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్యారడైజ్- మేడ్చల్(23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మెట్రో రైల్ ఫేజ్-2 'బి'లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సీఎం ఆదేశించారట. కాగా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్‌బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. గత మల్కాజ్ గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్‌ల రూట్ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా మెట్రో ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు.



WhatsApp Image 2025-01-01 at 10.26.37 PM డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎంసూచించినట్టు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్-2 'ఏ' భాగం లాగే 'బి' భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు ఇతర అనుబంధ డాక్యుమెంట్ ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .