స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో  దంత వైద్య శిబిరం

స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో  దంత వైద్య శిబిరం

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో గురువారం పాఠశాల చిన్నారులకు దంత వైద్య శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులకు వారి దంతాలను వైద్యులకు క్షుణ్ణంగా పరిశీలించి దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. స్థానిక మమత దంత వైద్య కళాశాల వైద్యులు పాఠశాల చిన్నారుల పళ్ళు వరుసలను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్య నిపుణులు చిన్నారులకు పలు దంత సలహాలను తెలియజేశారు. చాక్లెట్లు, రంగురంగుల తినుబండారాలను తినడం వలన దంతాలకు హాని జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం దంతాలను పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే ఏవైనా తినాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనపు కృష్ణ చైతన్య మాట్లాడుతూ శరీర ఆరోగ్యానికి దంత సంరక్షణ కీలకమని తెలిపారు. అందుకే పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు దంతాలను సంరక్షించుకోవడంలో బాధ్యతIMG-20250731-WA0143గా వ్యవహరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల దంత సంరక్షణ పట్ల జాగ్రత్తలు పాటించినప్పుడే పిల్లల ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతని సుకన్య,ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .