దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సుందరకరిస్తాం.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

 వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.

హసన్ పర్తి,సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.అనంతరం హసన్ పర్తి మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతసాగర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసామని త్వరలో పనులు పూర్తి చేయించి ఆలయాన్ని సుందరీకరిస్తామని తెలియజేశారు.అదేవిధంగా మడిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి భవన నిర్మాణ నాణ్యతను సమగ్రంగా తనిఖీ చేసి పనులు గరిష్ట నాణ్యతతో పూర్తి చేయడం కోసం సూచనలు అందించారు. అదే గ్రామానికి చెందిన బుర్ర సుధాకర్ పంట పొలాల కోసం భావి తవిస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడడంతో వారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు కుమార్,మాచర్ల మహేందర్,వట్టే శ్రీనివాసరెడ్డి,బుచ్చిరెడ్డి,చంటి రెడ్డి,చిర్ర సుమలత విజయ్,రామంచ ఐలయ్య,దయాకర్,మాట్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .