దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

ఉప్పల్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ మహంకాళి దేవాలయం, పోచమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని పూలతో, దీపాలతో అలంకరించి భక్తులకు మహాదర్శనం కల్పించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి, ఈగ ఆంజనేయులు, భాస్కర్, గుమ్మడవెల్లి కృష్ణ, మంద మురళి కృష్ణారెడ్డి, అన్నపు రెడ్డి కృష్ణారెడ్డి, కన్యమైన నరేష్, షాగా శేఖర్, కర్ణ ముదిరాజ్, గొరిగ బీరప తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .