ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
 
పేద, మధ్యతరగతి వర్గాల హక్కుల కోసం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులపాటు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోచమైదాన్ జంక్షన్‌లో మొదటి రోజు దీక్షలు కొనసాగాయి. పార్టీ అధినాయకులు విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబీసీ వర్గాల ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, మరియు 200 గజాలలో నాలుగు గదుల ఇళ్ల కోసం ఈ పోరాటం జరుగుతోంది.
 
పార్టీ కీలక డిమాండ్లు:
1. నాణ్యమైన ఉచిత విద్య అందించటం.
2. అన్ని గ్రామాల్లో అత్యాధునిక స్కూల్, కాలేజీల నిర్మాణం.
3. ప్రతి గ్రామంలో అత్యాధునిక హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించటం.
4. అర్హులకు సాగు నీటి సౌకర్యంతో వ్యవసాయ భూమి కేటాయింపు.
5. అర్హులందరికీ 4 గదుల పక్కా ఇళ్ల నిర్మాణం.
 
ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్, ఉపాధ్యక్షులు సిలివేరు రవి, కార్యదర్శి గాదె పూర్ణచందర్, ఇతర నాయకులు, మహిళా నాయకురాలు మిట్టపెల్లి రవళి, డీ ఎస్ యూ నాయకులు, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మాదాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .