నాచారం డివిజన్ కార్యాలయం ముందు వికలాంగుల మహా ధర్నా
నాచారం, సెప్టెంబర్ 20(తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం వికలాంగుల, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా జరిగింది.ఈ ధర్నాను ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. వికలాంగుల పెన్షన్ 6 వేల రూపాయలకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4 వేల రూపాయలకు, కండరాల బలహీనత గల వారికి 15 వేల రూపాయలకు పెంచాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధి కోరిపాక అంజి మాదిగ మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులు, చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం పెన్షన్ల పెంపులో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.తరువాత నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన శేఖర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ మహా ధర్నాలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కేశవులు, ఉప్పల్ కోఆర్డినేటర్ ఎర్పుల నాగరాజు, నాచారం డివిజన్ అధ్యక్షుడు శ్రీ మూర్తి, నాయకులు నాగరాజు, కోరపాక యోగేష్, సునీల్, విహెచ్పిఎస్ అనిల్, సుమన్, సైదులు, కిషన్, సోమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments