ధూప దీప నైవేద్య అర్చక సంఘం కార్తీక వనసమారాధన
ఖమ్మం బ్యూరో, నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం జిల్లా ధూప దీప నివేదన అర్చక సంఘం కార్తీక వన సమారాధన 12-11-2025 బుధవారం రోజున ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామం లో మామితోటలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా డిడిఎన్ సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ,ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు,కన్వీనర్/కోశాధికారి అన్నావజ్జల ప్రసాద్ శర్మ సంయుక్త ప్రకటన ద్వార తెలియజేశారు .
ఎర్రుపాలెం మండలం డీడీఎన్ అర్చకుల సహకారంతో నిర్వహించే వన సమారాధనకు జిల్లా లోని డీడీఎన్ అర్చకులందరు కుటుంబ సమేతంగా వచ్చి వన సమారాధనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
వన సమారాధనలో రుద్రాభిషేకం,
సత్యనారాయణ స్వామి అర్చన,సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్చకుల పడకలపై అవగాహన అర్చకుల సమస్యలపై చర్చలు అర్చక పెద్దలకు సన్మానం కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు
అన్ని మండలాల నుండి అర్చకులు పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేసారు


Comments