దళిత వాడపై వివక్ష.. బోనాల పండుగ పూట కూడా చీకట్లే!

దళిత వాడపై వివక్ష.. బోనాల పండుగ పూట కూడా చీకట్లే!

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో దళిత వాడ ప్రజలు వివక్షకు గురవుతున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామమంతా వెలుగులా మెరిసిపోతుంటే, దళిత వాడ మాత్రం చీకట్లలో మగ్గిపోతోంది. కారణం – పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం, వివక్షత.

బీసీ వాడలోని ప్రతి వీధి దీపం వెలిగేలా చూసిన పంచాయితీ సిబ్బంది, అదనంగా ఫోకస్ లైట్లూ ఏర్పాటు చేశారు. కానీ దళిత వాడలో మాత్రం ఒక్క వీధి దీపం కూడా వెలగకుండా వదిలేశారు. పండుగ రోజునా ఇలాంటి వివక్ష తలెత్తడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అందరికీ సమాన హక్కులు ఉన్నా, కేవలం దళిత వాడకే మౌలిక సదుపాయాలను నిరాకరించడం ఘోర అన్యాయం. కనీసం వీధి దీపాలు కూడా వెలిగించకుండా నిర్లక్ష్యం వహించిన పంచాయితీ కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.IMG-20250817-WA0101IMG-20250817-WA0100

“ఒక వాడ వెలుగులో మునిగిపోతుంటే, మరొక వాడ చీకట్లో మగ్గిపోవడం ఏ విధమైన పాలన?” అని గ్రామస్థులు మండిపడుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .