ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, షూ పంపిణీ..
దాత ప్రవాస భారతీయురాలు స్వాతిని సన్మానించిన ఎంఈఓ..
Views: 22
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
తల్లాడ మండలంలోని అంజనాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రవాస భారతీయురాలు అనుమోలు స్వాతి బ్యాగులు, షూ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్, అంజనాపురం గ్రామం మాజీ సర్పంచ్ కొమ్మినేని విద్యాసాగర్, ఎంపీటీసీ కొమ్మినేని ప్రభాకర్ చేతుల మీదుగా అందించారు అనంతరం స్వాతిని ఎంఈఓతో పాటు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వీటిని అందించినట్లు తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments