సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేత

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

మల్కాజిగిరి, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి డివిజన్‌కు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అందించబడింది. మొత్తం రూ.99,000/- విలువైన చెక్కులను శుక్రవారం రోజు బోయిన్‌పల్లి క్యాంప్ ఆఫీస్‌లో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులు అందుకున్నారు.ఈ సందర్భంగా సూర్యకళకు రూ.51,000/-, రవీందర్‌కు రూ.48,000/- మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారుWhatsApp Image 2025-10-10 at 9.04.42 PM.ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆపదలో అండగా నిలుస్తుంది. వైద్య ఖర్చులు భరించలేని వారికి ఈ నిధి దైవానుగ్రహంలా మారుతోంది” అని అన్నారు.అలాగే మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ సేవలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, శాస్త్రి, గిరి, బిఆర్ఎస్ నాయకులు జనార్ధన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .