మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
ఎల్కతుర్తి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న 83 మంది పదవ తరగతి విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.
హుజురాబాద్‌కు చెందిన ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, పాఠశాల ప్రిన్సిపాల్ దేవులపల్లి శ్రీకాంత్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్యాడ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “నా తల్లి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించడం అభినందనీయ విషయం. విద్యార్థులు కూడా కృషి చేసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి” అని సూచించారు.
ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ, “2011 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందిస్తున్నాను. అలాగే గణిత, సైన్స్ టాలెంట్ టెస్టులు నిర్వహించి బహుమతులు, మెరిట్ అవార్డులు కూడా అందజేస్తున్నాను” అని తెలిపారు.
అధ్యాపక బృందం మాట్లాడుతూ, “మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments