మహమ్మద్ హుస్సేన్ పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
దేవన్న యాదవ్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్
Views: 9
On
వనపర్తి,నవంబరు24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలోని మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్ చీరలను అందజేశారు.ఈ సందర్భంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ రెడ్డి, యాదగిరి, వేణుగోపాల్ రెడ్డి, కురుమూర్తి వెంకటయ్య, కిష్టారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments