ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

మల్కాజ్‌గిరి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

 మల్కాజ్‌గిరి ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా  ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు ఆశీర్వాదంగా నిలిచాయని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, ఆర్థిక భద్రత, మహిళా సాధికారతకు ఈ పథకాలు ప్రతీకలని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగిస్తుండడం సంతోషకరమని, “లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీని ప్రభుత్వం నెరవేర్చాలని” ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.WhatsApp Image 2025-11-10 at 6.38.53 PMఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనంతలక్ష్మి, మల్కాజ్‌గిరి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గౌతమ్‌నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, అమీనుద్దీన్, శివ గౌడ్, చిందం శ్రీనివాస్, శంకర్ రావు, హేమంత్ పటేల్, శోభ, ఉస్మాన్, మారుతి ప్రసాద్, రాజు, జనార్ధన్, వెంకటేష్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .