రైస్ మిల్లును సందర్శించిన జిల్లా కలెక్టర్

రైస్ మిల్లును సందర్శించిన జిల్లా కలెక్టర్


WhatsApp Image 2024-12-05 at 9.41.16 PM

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలోని రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య గురువారం పరిశీలించారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు చేరిన సన్న, దొడ్డు రకం ధాన్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మిల్లులో ధాన్యం వడగడుతున్న విధానాన్ని పరిశీలిస్తూ, ప్రాసెస్‌పై అధికారులతో చర్చించారు. 
ధాన్యం కొనుగోలు, ప్రాసెసింగ్ ప్రక్రియలను సమీక్షించి, నాణ్యతను పెంపొందించేందుకు అవసరమైన సూచనలు చేయడం ఈ పరిశీలనలో భాగమైంది.ఈ సందర్శనలో డిసిఒ కొమరయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .